బీహార్‌లో బ‌దిలీల‌కు ఈసీ శ్రీ‌కారం

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లను సజావుగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అందులో భాగంగా సొంత‌ జిల్లాల్లో ప‌ని చేస్తున్న అధికారుల‌ను, ఒకేచోట దీర్ఘ‌కాలంగా ప‌నిచేస్తున్న అధికారుల‌ను బ‌దిలీ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి, రాష్ట్ర‌ ఎన్నిక‌ల అధికారికి లేఖ రాసింది. ఎన్నిక‌ల విధుల‌తో నేరుగా సంబంధ‌మున్న అధికారులు, పోలీస్ అధికారుల‌ను సొంత జిల్లాల నుంచి బ‌దిలీ చేయాల‌ని, ఒకేచోట  మూడేళ్ల కు మించి ప‌ని చేస్తున్న వారిని కూడా బ‌దిలీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.