ఎయిర్ పోర్టులో123 కిలోల బంగారం చోరీ

పెరూ దేశం విమానాశ్రయంలో జరిగిన దోపిడీ సన్నివేశం హాలీవుడ్ సినిమా ఘట్టం మాదిరి ఆశ్చర్యం కలిగిస్తుంది. కొందరు దుండగులు విమానాశ్రయ రన్ వే పైకి దూసుకు వెళ్ళి తుపాకులతో కాల్పులు జరిపి, భాష్పవాయు గోళాలు ప్రయోగించి భయాత్పోతాన్ని కలిగించారు.ఆ తర్వాత అక్కడ ఒక విమానంలోకి ఎక్కించడానికి సిద్దంగా ఉన్న పదమూడు కోట్ల రూపాయల విలువైన సుమారు 123 కిలోల బంగారాన్ని వారు అపహరించుకుని పోయారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. మొత్తం పన్నెండు మంది దోపిడీ దొంగలు ఈ దోపిడీలో పాల్గొన్నారు. వీరంతా దోచుకుని పక్కన ఉన్న బొలివియా దేశానికి పారిపోవాలని వీరు పధకం పన్నారట. దోపిడీ తర్వాత పోలీసులు అన్వేషించగా ఆరుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ముప్పై కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.