టీచర్స్ డేని పురస్కరించుకుని గూగుల్‌ కొత్త డూడుల్‌

భారత రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్‌ 5న టీచర్స్ డేని పురస్కరించుకుని గూగుల్‌ కొత్త డూడుల్‌ను రూపొందించింది. ఈరోజున చిన్నారి టీచర్లు తమ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పడం, సంప్రదాయ దుస్తుల్లో రావడం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యాన్నే తీసుకుని గూగుల్‌ తన డూడుల్‌ను రూపొందించింది. ఇది టీచర్స్ డేను ప్రతిబింబించే విధంగా ఉంది. ఈ డూడుల్‌ పాఠశాలలో విజ్ఞానం నెర్పే నేపథ్యాన్ని తెలియజేస్తోంది.
Happy Teacher's Day