42 మందితో శ్రీలంక కేబినెట్‌

ఇటీవల సార్వత్రిక ఎన్నికలను పూర్తి చేసుకున్న శ్రీలంకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. మొత్తం 42 మంది సభ్యులతో కూడిన మంత్రిమండలితో శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో 31 మంది కేబినెట్‌ మంత్రులు యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)కి చెందిన వారు కాగా మిగిలిన 11 మంది శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీకి చెందినవారు. మంత్రిమండలిలో ముగ్గురు తమిళులు, నలుగురు ముస్లింలకు, ఇద్దరు మహిళకు కూడా కేబినెట్‌లో చోటు లభించింది. మహిళలిద్దరూ యుఎన్‌పికి చెందిన వారే కావటం విశేషం.