దిండుతో బాదితే.. అప‌స్మార‌క స్థితిలోకి!

ఇదే చిత్రం! దిండుతో కొట్టే మెత్త‌టి దెబ్బ‌ల‌కు మ‌నుషులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ‌తారా?  నిజంగానే వెళ్లారు మ‌రి! విష‌యమేంటంటే..! అమెరికా మిల‌ట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న విద్యార్థులంద‌రికీ ఏటా పిల్లో ఫైట్ నిర్వ‌హిస్తారు. మెత్త‌టి పిల్లోల‌తో విద్యార్థులంతా కొట్టుకోవాలి. ఇది అనేక సంవ‌త్స‌రాల నుంచి సంప్ర‌దాయంగా వ‌స్తోంది. అయితే ఆర్మీ విద్యార్థుల్లోని కొందరు ఆక‌తాయిలు పిల్లోలో గ‌ట్టి వ‌స్తువులు పెట్టుకుని ఫైట్‌లో పాల్గొన్నారు. దీంతో దాదాపు 30 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఒక‌రు అప‌స్మార‌క స్థితిలోకి జారుకున్నార‌ని సైనిక విద్యార్థులు ట్వీట్ చేశారు. అయితే అధికారులు ఈ వార్త‌ల‌ను ఖండించారు. విద్యార్థులు గాయ‌ప‌డ్డ మాట వాస్త‌వ‌మే. ఎవ‌రికీ అంతగా తీవ్ర గాయాలు కాలేదు అని స్ప‌ష్టం చేశారు.  పిల్లోఫైట్ ర‌క్త‌సిక్త‌మైనంత మాత్రాన దీన్ని ర‌ద్దు చేయ‌లేమ‌ని, ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తున్నామ‌ని చెప్పారు.