అంద‌రికంటే పొట్టివాడు..ఇక లేడు

పొట్టివాళ్ల‌లో పొట్టివాడు. అతిచిన్న మ‌నిషి..అతి పెద్ద రికార్డులో చోటు సంపాదించిన‌వాడు. ఇక లేడు. ఇక రాడు. నేపాల్‌కు చెందిన చంద్ర బ‌హ‌దూర్ డాంగి అనారోగ్యంతో క‌న్నుమూశాడు. 21.5 అంగుళాల ఎత్తుతో ప్ర‌పంచంలోనే అత్యంత పొట్టివాడిగా గిన్నిస్ బుక్ రికార్డుల‌కు ఎక్కిన డాంగి త‌న డెబ్బ‌యి ఐద‌వ ఏట‌..చ‌నిపోయారు. గిన్నిస్ రికార్డ్‌లో అత్యంత పొడ‌గ‌రిగా న‌మోదైన సుల్తాన్ కోసెన్‌తో చంద్ర బ‌హ‌దూర్ డాంగీ 2013లో దిగిన ఫోటోగ్రాఫ్ చాలా ప్రాచుర్యం పొందింది. నేపాల్ రాజ‌ధాని ఖాట్మండుకు 400 కిలోమీట‌ర్ల దూరంలోని ఓ గ్రామంలో చంద్ర బ‌హ‌దూర్ డాంగీ జన్మించాడు.