కొరియ‌ర్ బాయ్ కు బ్రేక్….?

కొరియ‌ర్ బాయ్ చిత్రం  ఏమిటో నితిన్ కు అనుకున్న‌ట్లుగా  క‌ల‌సి రావ‌డం లేదు.  సినిమా ప్రారంభించి కొంత కాలం  షూట్ చేసిన త‌రువాత  ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపించాయి. అయితే ఎట్ట‌కేల‌కు  నిర్మాత గౌత‌మ్ మీన‌న్  కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్  ఆడియో విడుద‌ల వేడుక చేశారు. ఆఫ్ కోర్స్  నితిన్  ప‌ట్టు బ‌ట్టి  అన్ని చేయించ‌డంతో   ఇది జ‌రిగింది అనేది ఒక టాక్.  త‌మిళ్ లో  జీవా హీరోగా చేస్తున్నారు. తెలుగు లో నితిన్ , యామిగౌత‌మి న‌టిస్తున్నారు.

  ఆడియో విడుద‌ల జ‌రిగిన త‌రువాత చిత్ర యూనిట్ ఎలాగైన ఈ వారంలో రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు.  అంటే ఈ నెల 11 న కొరియ‌ర్ బాయ్ ను దింపాల‌నుకున్నారు. కానీ.. సెన్సార్  ఇంకా పూర్తి కాక పోవ‌డం వ‌ల‌న  వాయిద ప‌డే అవ‌కాశం ఉంద‌ట‌. కొరియ‌ర్ బాయ్ కంటే  ముందు.. దాదాపు ఒక   అర‌డ‌జ‌ను చిన్న చిత్రాలు సెన్సార్ స్లాట్  నుబుక్ చేసుకుని క్యూలో వున్నాయ‌ట‌.  ఇవ‌న్ని కంప్లీట్ అయిన త‌రువాత గాని..  కొరియ‌బ‌ర్ బాయ్ సెన్సార్ ట‌ర్న్ వ‌స్తుంది.  ఇదంతా శుక్ర‌వారం లోపు  జ‌ర‌గ‌డం క‌ష్టం అంటున్నారు.  దీంతో   కొరియ‌ర్ బాయ్  ఈ నెల11న రాన‌ట్లే.   అందుతున్న స‌మాచారం ప్ర‌కారం…11 న మిస్ అయితే.. ఈ నెల 17న విడుద‌లకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.