సిబిఐ కోర్టులో హాజ‌రైన విష్ణు

హీరో   మంచు విష్ణు  సోమ‌వారం    సెన్సార్ కోర్టు లో  హాజ‌ర‌య్యారు.   గ‌తంలో సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు  శ్రీ‌నివాస‌రావు కేసుకు సంబంధించి  విష్ణు హాజ‌ర‌య్యారు. అందాల చంద‌మామ సినిమా సెన్సార్ కు  5 ల‌క్ష‌ల డిమాండ్ చేసి రెడ్  హ్యండెడ్ గా శ్రీ‌నివాస‌రావు దొరికి పోయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యం చెప్ప‌డానికే   విష్ణు  వ‌చ్చిన‌ట్లు  అధికారులు తెలిపారు.  అందాల చంద‌మామ ప్రొడ్యూస‌ర్   ప్ర‌సాద్ రెడ్డి  ఫిర్యాదు మేర‌కు   రంగంలోకి దిగి  శ్రీ‌నివాస‌రావును అరెస్ట్ చేశారు.  దీనిని బ‌ల‌ప‌రుస్తూ.. త‌న చిత్రాల‌కు కూడా సెన్సార్ బోర్డ్  మెంబ‌ర్స్ కొంద‌రు ఇబ్బంది పెట్టార‌ని..లంచం తీసుకుంటున్న మాట వాస్త‌వ‌మేన‌ని  విష్ణు చెప్పిన‌ట్లు  తెలుస్తుంది.  
విష్ణు న‌టించిన  డైన‌మైట్ చిత్రం  శుక్ర‌వారం రిలీజై   పాజిటివ్ టాక్ గెయిన్ చేసింది. రియ‌లిస్టిక్ ఫిల్మ్ గా దెవ క‌ట్టా చేసిన ఈ చిత్రంలో  విష్ణు  ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.