సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్స్ లీక్

పవన్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్  సినిమాకు సంబంధించి కొన్ని డైలాగులు లీకయ్యాయి. దాదాపు డజనుకు పైగా పంచ్ డైలాగులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇవన్నీ సినిమాలో లేకపోయినప్పటికీ కనీసం ఓ 4 డైలాగులైనా సినిమాలో ఉంటాయని భావిస్తున్నారు ఫ్యాన్స్. వాటిలో కొన్ని..
1. మీలాంటి వారికి లెక్కతో చెబితే తలకెక్కదని నాకు తెలుసురా.. అందుకే నా తిక్కతో వచ్చా..
2. నా హ్యాండ్ లో గన్స్ కంటే నా హార్ట్ లో గట్స్ కి పవర్ ఎక్కువరా..
3. రే.. పవర్ ను వాడుకోవాలనుకో బాగుపడతావ్.. ముట్టుకోవాలని చూడకు చచ్చిపోతావ్..
ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు కొన్ని నెట్ లో బాగానే హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి అసలైనవా.. నకిలీవా అనే విషయాన్ని మాత్రం మేకర్స్ కన్ ఫర్మ్ చేయట్లేదు. మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్ టీం ఫ్రెష్ గా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఇవాల్టి నుంచి పవన్-కాజల్ కలిసి కొన్ని సన్నివేశాల్లో నటిస్తారు. సినిమాకు సంబంధించి ఇది మూడో షెడ్యూల్. శరత్ మరార్-పవన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు.