కిక్ 2 ఎఫెక్ట్ ప‌డిందా..!

కిక్ -2′ చిత్రం ఫ్లాప్ ఎఫెక్టు రవితేజ కెరీర్ పై పడటం మొదలైంది. ఆయన దిల్ రాజు నిర్మాతగా కమిటవ్వనున్న చిత్రానికి రెమ్యునేషన్ విషయంలో విభేదాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. కిక్ 2 కు ముందు కమిటైన రెమ్యునేషన్ ను ఇప్పుడు దిల్ రాజు ఇవ్వనంటున్నారని, తగ్గించి ఇస్తాననటంతో రవితేజ ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. ఇదంతా దిల్ రాజు నిర్మాతగా ఓహ్ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరక్షన్ లో చేయబోయే చిత్రానికి అని తెలుస్తోంది. 
రవితేజ ప్ర‌స్తుతం ‘బెంగాల్‌ టైగర్‌’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  . రీసెంట్ గా వేణు శ్రీరామ్  ర‌వితేజ ను కలిసి కథ నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ ఇంప్రెస్ అయ్యి డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. అయితే    కిక్ 2 ప్లాప్ కావ‌డంతో.. ఈ సినిమాను నిర్మించ‌బోయో దిల్ రాజ్.. ర‌వితేజ కు  మొద‌టి చెప్పినంత  రెమ్యున్ రేష‌న్ ఇవ్వ‌డానికి  వెన‌కంజ వేస్తున్న‌ట్లు  టాక్.  ఒక స‌క్సెస్  వ‌స్తే రెమ్యున్ రేష‌న్ పెంచుతారా అనేది  సెకండ‌రీ..  కానీ.. ఒక ఫెయిల్యూర్ ప‌డితే మాత్రం  దిలిరాజ్ లాంటి నిర్మాత‌లు  వెంట‌నే  అలెర్ట్ అవుతుంటారు మ‌రి.