ఆ విషయంలో పాక్‌దే పైచేయి: తేల్చిన సర్వే

అవరోధం ఎక్కువగా ఉన్న చోటే అన్వేషించాలనే కోరిక కూడా అధికంగా ఉంటుందని చెబుతుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే రుజువైంది. ఇంటర్‌నెట్‌లో శృంగార విషయాలను అన్వేషిస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే పాకిస్తాన్ మొదటి స్థానాన్ని అక్రమించింది. ఇటీవల ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్ గూగుల్ ఈ విషయాన్ని వెల్లడించింది.  శృంగార విషయాలు తెలుసుకునేందుకు పరితపిస్తున్న దేశాల జాబితాను విడుదల చేసింది. శృంగారంలో చిన్న సమస్య నుంచి పూర్తి అవగాహన వరకు అన్నింటికి పాక్ యువత ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తోంది. పాక్ తర్వాత ఈజిప్ట్ ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ముందుంది. ఇరాన్‌, మొరాకో, సౌదీ, టర్కీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్థానికంగా శృంగార‌ అంశాలపై ఉన్న అంక్షల కారణంగానే అక్కడి యువత గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారని తేలింది.