అబ్బాయి క‌త్తి లా వున్నాడే..!

స‌ల్మాన్ ఖాన్. కండ‌ల వీరుడు.  సిక్స్ ప్యాక్ ను  స్థిరంగా మెయింటిన్ చేసి.. యూత్ లో  బాడి మెయింటినెన్స్ చేసుకోవ‌డం ప‌ట్ల  ప్రేర‌ణ అంటే   నూటికి నూరు శాతం   స‌ల్లుభాయే . క‌ట్ చేస్తే.. ఈ  కండ‌ల వీరుడు.. మ‌రో  కండ‌ల వీరుడ ని  హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. బాలీవుడ్  సీనియ‌ర్ న‌టుడు.. ఆదిత్య పంచోలి  త‌న‌యుడు   .. సూరజ్ పంచోలిని స‌ల్మాన్ ఖాన్ త‌న బ్యాన‌ర్ లో   హీరోగా ప‌రిచయం చేస్తున్నాడు.   ఈ చిత్రానికి హీరో అనే టైటిల్  పెట్టారు.

 సూర‌జ్ పంచోలి జియ‌ఖాన్  ను  ప్రేమించి మోసం చేశాడ‌ని  ఆమే సూయిసైడ్ నోటో లో రాయ‌డంతో కొన్ని రోజులు జైలు పాలు అయిన‌ప్పుడు..  వీళ్ల‌కుటుంబానికి స‌ల్మాన్ ఖాన్ పూర్తి మ‌ద్ద‌తు తెలియ చేశాడు.  మొత్తం మీద జియఖాన్ కేసు నుంచి బ‌య‌ట ప‌డిన త‌రువాత  స‌ల్మాన్ ఖాన్ .. సూర‌జ్ పంచోలి  తో ఈ చిత్రం చేశేడు.  ఈయువ న‌టుడి స‌ర‌స‌న   సునిల్ శెట్టి కూతురు  అతియ శెట్టి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. వీరిద్ద‌రి  పై ద‌ర్శ‌కుడు ఒక లిప్ లాక్ సీన్ చేశాడ‌ట‌. అది చూసిన స‌ల్మాన్.. త‌న  కెరీర్ లో ఇంత వ‌ర‌కు  అటువంటివి చేయ‌లేద‌ని..అందుకే త‌ను ప్రొడ్యూస్ చేసే చిత్రంలో కూడా అవి వుండ కూడ‌ద‌ని క‌ట్ చేయించేశాడ‌ట‌.     హీరో   చిత్రం లో  హీరోగారి లుక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి ఆర‌డుగుల  అజానుబాహుడిలా.. ప‌ల‌కులు పెంచిన దేహాంతో  సూర‌జ్ పంచోలి  క‌త్తిలా వున్నాడు..!   మ‌రి ఈ కొత్త జంట‌లో  ఎవ‌రు ఏ రేంజ్ లో స‌క్సెస్ అవుతారో తెలియాలంటే..  కొద్ది రోజులు ఆగాల్సిందే మ‌రి.