ముందు నగ్నచిత్రాలు… ఆపై అత్యాచారం

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్తూరులో జరిగిన దారుణమిది. తన ఇంట్లో అద్దెకుంటున్న వివాహిత యువతిని బెదిరించి నెలరోజులుగా అత్యాచారం చేశాడో ఘనుడు. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆ యువతిని ఇంటి యజమాని కొడుకు పవన్‌ ఎలాగైనా ట్రాప్‌ చేయాలనుకున్నాడు. దీనికి అతడు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి ఓ కుత్సిత పథకానికి తెర తీశాడు. రహస్యంగా ఆమెను నగ్నంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. నెమ్మదిగా అవి ఆమెకు చూపాడు. తనకు సహకరించక పోతే ఈ నగ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి బహిరంగం చేస్తానని, అందరికీ చూపి బయటపెడతానని బెదిరించాడు. ఇలాంటి హెచ్చరికలతోనే ఆమెను చంద్రగిరికి తీసుకుపోయాడు. అక్కడ ఓ గదిలో నిర్భంధించి నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలోనే అతడు ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసల పాల్జేశాడు. అతను లేని సమయంలో అక్కడ నుంచి తప్పించుకున్న ఆ యువతి కడప చేరుకుని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పవన్‌ అనే ఇతడు స్థానిక పోస్టుమాస్టర్‌ కొడుకుగా చెబుతున్నారు.