పోస్టర్లుగా భార్య నగ్న చిత్రాలు!

కట్టుకున్న భార్య తనను కాదని వెళ్ళిపోవడం గంగవెర్రులెత్తిన ఓ మొగుడు ఆమె నగ్న చిత్రాలను తీసి ఊరంతా అతికించి కక్ష తీర్చు కున్నాడు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌కు చెందిన వెంకటప్ప(65) అనే వృద్ధుడికి ఇద్దరు భార్యలు. రెండోభార్యను వదిలేసి రావాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి  వెళ్ళిపోయింది. వెళుతూవెళుతూ అందరిలో కడిగిపడేసింది. దీంతో రగిలిపోయిన వెంకటప్ప తను భార్యతో ఏకాంతంగా గడిపిన ఫొటోలతో పోస్టర్లు ముద్రించి ఊరంతా అతికించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడ్ని కటకటాల వెనక్కి పంపారు. పోస్టర్లను బంధువులంతా చించేశారు.