కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడు మృతి

విశాఖలోని హార్బర్ పార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ దారుణం చోటు చేసుకుంది. శివకేశవ్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్కలు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఆరుబయట ఆడుకుంటున్న ఈ చిన్నారిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గతంలో గుంటూరుజిల్లాలో కుక్కలు పాశవికంగా దాడిచేసి ఒక బాబును చీల్చి చంపడం, గుంటూరు ఆసుపత్రిలో ఒక బాబును ఎలుకలు పీక్కు తినడం వంటి సంఘటనలు మరువకముందే మళ్ళీ అలాంటి సంఘటన జరగడంతో ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది.