అబ్బే అదేమి లేదంటున్న త‌మ‌న్న‌…!

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగు చేసేందుకు తమన్నాను ఎంపిక చేసినట్లు ,ఈ సాంగులో తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ తో స్టెప్పులేయనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కేవలం రూమర్సే అని ట్విట్టర్ ద్వారా తమన్నా ఖండించింది. 
ఇక ఈ చిత్రంలో మెగా స్టార్  గెస్ట్ రోల్ చేస్తున్నారు. దాదాపు 15 నిముషాల సేపు  క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది.  ఈ చిత్రంలో  త‌న గెస్ట్ రోల్ ను చూసి అభిమానుల స్పంద‌న‌ను బ‌ట్టి.. త‌న 150 సినిమా పై ఒక క్లారీటికి  చిరు వ‌చ్చే అవ‌కాశం ఉంది.  ఆడియ‌న్స్ నుంచి  స్పంద‌న అద్భుతుంగా వుంటే..  చిరు స్పీడ్ గా  150 వ‌చిత్రం చేసే అవ‌కాశం వుందంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.  ఒక బ్రూస్ లీ గా   రాంచ‌ర‌ణ్  ఈ చిత్రంలో  వండ‌ర్ ఫుల్  పెర్ఫార్మెన్స్ ఇచ్చార‌ని తెలుస్తుంది.