డబ్బు కోసం 85 సార్లు ప్రసవాలు!

అస్సొం రాష్ట్రంలో కరీంగంజ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామీణ ఆస్పత్రిలో విచిత్రకరమైన అవినీతి చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోన్న లిలీ బేగం లష్కర్ ప్రభుత్వ పథకం కింద ఇచ్చే డబ్బు కోసం అవినీతికి పాల్పడింది. ఆస్పత్రిలో ప్రసవించే బాలింతలకు డబ్బును అందజేసే విభాగానికి ఆమే ఇన్‌ఛార్జీ కావడంతో పని మరింత సులువైంది. వివరాల్లోకి వెళ్తే… ప్రభుత్వ గ్రామీణ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళల కోసం రూ.500 ప్రోత్సాహకంగా అస్సొం ప్రభుత్వం అందజేస్తుంది. లిలీ బేగం మొత్తం 160 డెలివరీలు ఆస్పత్రిలో జరిగినట్టు రికార్డుల్లో చూపించింది. వాటిలో అర్ధభాగం అంటే 80 కేసుల్లో తానే ప్రసవించినట్టు రికార్డులు సృష్టించి రూ.40 వేలు కాజేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు.