పోలీసు రాసలీలలు బట్టబయలు!

ఇటీవల అసెంబ్లీ బందోబస్తుకు హైదరాబాద్ కి వచ్చిన ఓ లేడీ ఎస్సై, మరో ఎస్సైలు లాడ్జిలో కలిసి ఉండగా.. మీడియాకు చిక్కిన విషయం మరువకముందే అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్లో జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్లో హెడ్ కాని నిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధు సూద‌న్ రెడ్డి (45) కి స్థానికంగా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.  వీరి సంబంధం స‌ద‌రు మ‌హిళ భ‌ర్త‌కు చాలాకాలంగానే తెలుసు. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి ఉప్పుగూడలో ని సాయిబాబా నగర్లో సదరు మహిళతో, హెడ్కానిస్టేబుల్ కలిసి ఉన్నార‌ని తెలుసుకుని వారి గ‌దికి బయట నుంచి గడియ పెట్టాడు. స్థానికులను, చుట్టుపక్కలవారిని పిలుచుకు వచ్చాడు. వారంతా హెడ్కానిస్టేబుల్ను పోలీసులకు అప్పగించారు.