మళ్లీ కండలు పెంచుతున్న ప్రభాస్

హీరో ప్రభాస్ మళ్లీ జిమ్ కే ఫిక్స్ అయ్యాడు. రోజా పొద్దున్న లేచిన దగ్గర్నుంచి సాయంత్రం వరకు ఎక్సర్ సైజులే చేస్తున్నాడు. దీనికి కారణం బాహుబలి-2. అవును.. డిశంబర్ నుంచి సెట్స్ పైకి రాబోతున్న బాహుబలి-2 కోసం ప్రబాస్ రెడీ అవుతున్నాడు. సీక్వెల్ లో అమరేంద్ర బాహుబలి పాత్రను ప్రభాస్ పోషించాల్సి ఉంది. ఈ క్యారెక్టర్ కు బాగా కండలు తిరిగి, కాస్త లావుగా కనిపించే శరీరాకృతి కావాలి. ఈమధ్య కాలంలో కాస్త తగ్గిన ప్రభాస్.. అమరేంద్ర  బాహుబలి పాత్ర కోసం మళ్లీ వెయిట్ పెరుగుతున్నాడు. పనిలోపనిగా కత్తియుద్ధం, గుర్రపుస్వారి, కొండలు ఎక్కడం లాంటివి కూడా మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొత్తంమ్మీద రాజమౌళి రెగ్యులర్ అబ్జర్వేషన్ లో ప్రభాస్ మరోసారి ఫిట్ గా తయారవుతున్నాడు. అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం రాజమౌళి ఇప్పటికే ఓ సెటిల్ గెటప్ అనుకున్నాడట. హెయిర్ స్టయిల్, లుక్ వరకు అంతా ఫిక్స్ అయిందని సమాచారం. బాహుబలి-2 ప్రమోషన్ ఈ లుక్ తోనే షురూ అవుతుంది.