అమీర్ మూవీ ఫస్ట్ లుక్ అదరహో..

అమీర్ ఖాన్ ఏం చేసినా అది విలక్షణంగా ఉంటుంది. సినిమా సెలక్షన్ నుంచి గెటప్ వరకు.. ఫస్ట్ లుక్ నుంచి క్లైమాక్స్ వరకు అమీర్ సినిమా సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది. అందుకే అతడి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతాడు. ఆ నవ్యతే సినిమాకు రికార్డు వసూళ్లు రప్పిస్తుంది. ఇప్పుడు తన నయామూవీ దంగల్ విషయంలో కూడా అదే పార్ములాను ఫాలో అవుతున్నాడు అమీర్ ఖాన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లావుగా తయారైన అమీర్ ఖాన్, ఇప్పుడు దంగల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. తన ఫిజిక్ ను ఎక్కడా ఎలివేట్ చేయకుండా.. కేవలం ఫేస్ మాత్రమే కనిపించేలా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ సూపర్ హిట్టయింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ఫస్ట్ లుక్ కు లక్షలాది హిట్స్ వచ్చాయి. ఈ లుక్ విడుదలైన కొద్ది రోజులకే తన ఫుల్ గెటప్ ను విడుదల చేయాలనుకుంటున్నాడు అమీర్ ఖాన్. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ మల్లయుద్ధ యోధుడిగా కనిపించబోతున్నాడు.