తెలంగాణలో పెరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలు

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పెరిగాయి. స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.