27న గణేష్‌ శోభాయాత్రకు భారీ భద్రత

గణేష్‌ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అపశ్రుతి జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రతి అంగుళాన్నిడేగకన్నుతో పరిశీలించనున్నారు. పోలీసు అధికారులు షిఫ్ట్‌లవారీగా కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించాలనుకుంటున్నారు. ఖైరతాబాద్‌ భారీ గణేష్‌ను మొదటిసారిగా పోలీస్‌ కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం పరిధిలోకి తెచ్చారు. నగరంలో శోభాయాత్ర బయలుదేరే బాలాపూర్‌ చెరువు నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 13 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలోనే ఈనెల 27న గణేష్‌ శోభాయాత్ర జరగనుంది. ఇప్పటికే ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఫోలీసులు 37 సీసీ కెమెరాలు అమర్చారు. ఈ 13 కిలోమీటర్లలో ప్రతి అంగుళాన్ని పరిశీలించడానికి వీలుగా మరో 300 కెమెరాలను అదనంగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కిలోమీటర్‌ దూరం వరకు జామ్‌ చేసి క్షుణ్ణంగా ఆయా ప్రాంతాలను పరిశీలించొచ్చు.