నకిలీ ఇన్‌కంటాక్స్‌ అధికారి అరెస్ట్

కృష్ణా జిల్లాలోని కైకలూరులో పిడకల సురేష్ అనే వ్యక్తి ఐటీ అధికారినంటూ హల్‌చల్ చేశాడు. కైకలూరులో చేపల చెరువు యజమానిని సురేష్‌ బెదిరించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీన్‌లోకి రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. రెండేళ్లుగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐటీ అధికారినంటూ పలువురిని బెదిరించి, సొమ్ము వసూలు చేశాడని పోలీసులు తేల్చారు. అనుమానంతో ప్రశ్నించిన వారికి నకిలీ విజిటింగ్ కార్డు చూపి మాయ చేసేవాడని తెలిసింది. ఇన్నాళ్లకు పోలీసులు అతని ఆట కట్టించారు. సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.