సూర్యలంక బీచ్‌లో ఆరుగురు గల్లంతు!

గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు కనిపించకుండా పోయారు వీరిలో నలుగురి మృతదేహాలు కనిపించాయి. మరో ఇద్దరి కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థులంతా హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన వారిగా తెలుస్తోంది.