త్రివిక్రమ్  మళ్ళీ తగ్గించుకున్నాడు…

త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో నితిన్‌ హీరో గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నిమిత్తం త్రివిక్రమ్ ..రెమ్యునరేషన్ వద్దన్నట్లు సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం అనుకున్న స్ధాయిలో ఆడకపోవటంతో ఈ చిత్రానికి రెమ్యునరేషన్ వద్దని, కేవలం లాభాల్లో వాటా అడిగారని తెలుస్తోంది.
రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రానికి ‘అ ఆ’ అనే పేరును ఖరారు చేశారు. ‘అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి’ అనేది ఉపశీర్షిక. ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’తో పేరు సంపాదించింది అనుపమ. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి  గ‌తంలో కూడా ఏదైన తన సినిమా డిజాస్టర్  అయినప్పుడూ కూడా… త్రివిక్ర‌మ్ త‌న రెమ్యునరేష‌న్ తగ్గించుకున్న విష‌యం తెలిసిందే. ఒక డిజాస్ట‌ర్ లేదా.. ఒక ఫెయిల్యూర్  ఎదురైతే  .. త‌రువాత  మంచి హిట్ కొ్ట్టి స‌త్తా చాటుకోవ‌డం  త్రివిక్ర‌మ్  స్టైల్. సో  నితిన్ చిత్రం  తో ఎలాగైన మంచి  హిట్ అందివాల‌నే వ‌ర్కువుట్ చేస్తున్నార‌న్న‌మాట‌.