అదితి ఆచూకీ చెబితే రూ.5 లక్షల బహుమతి

నాలుగు రోజుల క్రితం విశాఖలో కనిపించకుండా పోయిన ఆరేళ్ల చిన్నారి అదితి ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలు రూపాయిలు బహుమతి ఇస్తామని పాప తండ్రి శ్రీనివాసరావు ప్రకటించారు. మృతదేహం ఎక్కడా దొరక్కపోవడం వల్ల తాము ఇంకా అదితి బతికే ఉందని భావిస్తున్నామని అన్నారు. పొలీసుల తరఫు నుంచి ఒక నోడల్ టీంను ఏర్పాటు చేశారని, సముద్రంలో ఇవాళ కూడా మరబోట్ల ద్వారా గాలింపు చేశామని చెప్పారు. ఇప్పటివరకూ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రంలో గాలింపు చేశామని, నిర్మానుష్యంగా ఉన్న బీచ్ ప్రాంతాల్లో సోదాలు చేయమని జిల్లా కలెక్టర్ను కోరినట్లు శ్రీనివాసరావు తెలిపారు. అదితి ఆచూకీ తెలిస్తే 9701000564 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.