అమెరికా కాలేజీలో ఉన్మాది కాల్పులకు 13 మంది మృతి

అమెరికాలోని ఓ కళాశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 13 మంది దారుణంగా చనిపోయారు. ఒరెగన్‌ స్టేట్‌లోని ఉంవ్‌క్వా కళాశాలలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన ఓ అగంతకుడు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 13 మంది చనిపోగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని అగంతకుడిపై ప్రతి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉన్మాది ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.