ఫేస్ బుక్ విజయం వెనుక… ?

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సరికొత్త విప్లవం సృష్టించింది ఫేస్ బుక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెటిజన్ల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేర్పులతో ఇప్పుడు ఫేస్ బుక్ ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ ఫేస్ బుక్ ఈస్థాయిలో ఉండడానికి కారణం మాత్రం మన దేశమే కారణమని ఆసంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అంటున్నారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటన‌లో భాగంగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ను కలిసినపుడు ఈ విషయం ఆయనే స్వయంగా  చెప్పారు. 
పదేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఫేస్ బుక్ ప్రారంభించినపుడు కొన్ని సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తాయని.. ఆ సమయంలో తన గురువు, మార్గదర్శి అయిన ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ను కలిసినట్టు జుకర్ బర్గ్ తెలిపాడు. 
ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ తనకు ఇండియాలోని ఉత్తరాఖండ్ లో ఉన్న ఓఆశ్రమం గురించి చెప్పారని.. అక్కడకు  వెళ్లాలని సూచించారని జుకర్ బర్గ్ తెలిపారు. స్టీవ్ జాబ్స్ చెప్పినట్టే తాను ఆశ్రమానికి వెల్లి నెలరోజులు ఉన్నానని… ఆ సమయంలో అక్కడ ప్రజలతో కలిసిపోయానని గుర్తు చేసుకున్నాడు. ఆ నెల రోజుల తన భారత పర్యటనల ఎంతో స్వాంతన చేకూరిందిని చెప్పారు. ఆ ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాతే ఫేస్ బుక్ మార్కెట్  పెరగడం మొదలైందన్నారు.. అయితే మార్కె జుకర్ బర్గ్ ఉత్తరాఖండ్ లోని ఏ ఆశ్రమానికి వెళ్లాడన్నది మాత్రం చెప్పలేదు. అయితే స్టీవ్ జాబ్స్ కూడా యాపిల్ కంపెనీని ప్రారంభించకముందు కొంతకాలం ఇండియాలోనే గడిపారు. ఆసమయంలో ఉత్తరాఖండ్ లోని కంచిధామ్ ఆశ్రమంలో స్టీవ్ జాబ్స్ ఉన్నారు. ఇప్పుడు ఫేస్ బుక్ సీఈవో మార్క్ కూడా కంచి ఆశ్రమానికే వెళ్లి ఉంటారని చర్చ నడుస్తోంది.