జర నవ్వండి ప్లీజ్ 226

శ్యాం: నేను ఒక్క వేలితో ఏనుగును పైకెత్తుతాను.
రాం: పందెం కాస్తాను. అసంభవం.
శ్యాం: సరే. నా వేలిమీద నిలబడేంత ఏనుగును తీసుకురా చూపిస్తాను.
——————————————————————————————————–
“సింహం గుహలోకి ధైర్యంగా వెళ్ళి తిరిగి వచ్చింది ఎవరో తెలుసా?
“ఎవరు?”

“సింహం!”
——————————————————————————————————–
“వెయిటర్‌! ఈ తిండి దరిద్రంగా ఉందయ్యా”
“ఎవరు చెప్పారండి!”

“దీంట్లో పడి చచ్చిన బల్లి”.