కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం…30 ఇళ్ళు దగ్ధం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రశాంతనగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్ళు దగ్ధమై పోయాయి. వంట చేస్తున్నప్పుడు జరిగిన తప్పిదమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన వారంతా పేదవారే కావడం గమనార్హం. ఒక ఇంటికి నిప్పు అంటుకోగా దాన్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే చుట్టుపక్కల ఉన్న మిగిలిన ఇళ్ళకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ముఫ్ఫై ఇళ్ళు కాలి బూడిదయ్యాయి. అగ్ని మాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.