హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో స్వ‌ల్ప భూకంపం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో స్వ‌ల్పంగా భూమి కంపించింది. మండి జిల్లాలో భూమి కంపించింద‌ని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇది రిక్ట‌ర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. అయితే భూ ప్ర‌కంప‌న‌లు చాలా స్వ‌ల్ప‌స్థాయిలో ఉన్నాయ‌ని, ప్రాణ‌న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు. మండి జిల్లా ప‌రిధిలో ఉద‌యం పూట భూమి కంపించింది అధికారులు ప్ర‌క‌టించారు.