విశాఖ నుంచి విజయవాడకు శతాబ్ది

విశాఖపట్నం నుంచి విజయవాడకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు అంగీకరించారు. అంతటితో ఆగకుండా ఈ రైలును వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుతో విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు సమావేశమై విశాఖ నుంచి విజయవాడకు శతాబ్ది రైలు వేయాలని సురేష్ ప్రభును కోరారు. అశోక్ కోరికను మన్నించిన కేంద్రమంత్రి రైలును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తన కోరికను తీర్చినందుకు అశోక్ కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.