ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి కల్పించాలి: గజల్‌

తిరుమల, తిరుపతితో సహా అన్ని దేవాలయాలను ప్రభుత్వ పెత్తనం నుంచి మినహాయించాలని గజల్‌ శ్రీనివాస్‌ డిమాండు చేశారు. వీటిని కాపాడుకునే బాధ్యత ప్రతి భక్తుడు తీసుకుంటాడని ఆయన అన్నారు. ఎండోమెంట్‌ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈనెల 10న ఏయూలో పీఠాధిపతులు, స్వామీజీలతో దీనికి సంబంధించి సదస్సు జరుగుతుందని చెప్పారు. అదేరోజు సాయంత్రం భారీ ర్యాలీ జరగనుందని గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.