శునకాలకో మ్యాగజైన్‌

వీధికుక్కల ఫొటోలతో కవర్‌పేజ్ పెట్టి మ్యాగజైన్ నడిపిస్తున్నాడు ఓ యువకుడు. పోలాండ్‌కి చెందిన పో ప్సూ ట మోడా పేరుతో వీధికుక్కలను అందంగా ముస్తాబు చేసి ప్రపంచ దేశాల్లోని ప్రముఖ మ్యాగజైన్లపై ఉన్న మోడల్స్‌లాగే కుక్కలకూ మేకప్ వేసి ఫొటోషాప్ నిర్వహిస్తున్నారు. అందం అనేది కేవలం చర్మానికే సొంతం కాదని, మనసుకు సంబంధించినదని, కుక్కలకు కూడా మనసుంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మ్యాగజైన్ నిర్వహిస్తున్నట్టు పో ప్సూ ట మోడా నిర్వాహకులు చెప్తున్నారు.