రైతులకు భరోసా ఇవ్వని కేసీఆర్‌: జస్టిస్ చంద్రకుమార్‌

రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇవ్వడం లేదని తెలంగాణ రైతు జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. రైతుల కోసం ఏం చేయబోతున్నారో సీఎం కేసీఆర్ వివరించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టాలను చూసి ధైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గాలు అన్వేషించాలని సూచించారు.