ఇది రాబందుల బంద్‌: మంత్రి జగదీష్‌

రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి బంద్‌పై ప్రతిపక్షాలను ప్రజలు నిలదీయాలని కోరారు. రాబందులన్ని ఒక్కటై బంద్‌కు పిలుపు ఇచ్చాయని, అవన్నీ కలిసి నిజాయితీగా పని చేస్తున్న తమ ప్రభుత్వంపై యుద్ధానికి వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఐక్యత వెనుక చంద్రబాబు హస్తం ఉందని జగదీష్‌రెడ్డి వెల్లడించారు.