బీహార్‌లో ఇద్దరు జంగిల్‌ రాజ్‌లు: మోడి

ప్రధాని నరేంద్ర మోదీ ఆర్జేడీ అధినేతను మరోసారి టార్గెట్ చేశారు. మహా కూటమిని గెలిపిస్తే ఇద్దరు జంగిల్ రాజ్‌లు పాలిస్తారంటూ పరోక్షంగా నితీష్, లాలూను విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితుడైన మాంఝీని సిఎంగా చేసిన నితీష్ కుమార్ ఆ తర్వాత వెన్నుపోటు పొడిచారని మోదీ ఆరోపించారు. ఇది దళితులను మోసగించినట్లేనని ఆయన అన్నారు. బీహార్‌లో కొనసాగుతున్న 60 ఏళ్ల ఆటవిక పాలనకు ముగింపు పలికి బీజేపీని గెలిపించాలని మోదీ పిలుపునిచ్చారు.