ఓటింగ్ ద్వారా నేపాల్ కొత్త ప్రధాని ఎన్నిక

రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఓటింగ్ ద్వారా నేపాల్ నూతన ప్రధానమంత్రిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా జరుగనున్న ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనాలని నేపాల్ అధ్యక్షుడు రాంబరణ్‌ యాదవ్ అన్నీ పార్టీలకు సూచించారు. నేపాల్ నూతన రాజ్యాంగంపై ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.