ఆన్‌లైన్ మార్కెట్ పద్దతిని ప్రోత్సహిస్తం: జూపల్లి

రాష్ట్రంలో దళారీల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఆన్‌ లైన్ మార్కెట్ విధానాన్ని పోత్సహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పెంజర్ల గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన పీ అండ్ జీ అమెజాన్ పరిశ్రమను ఆయన సందర్శించారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులతో ముచ్చటించిన మంత్రి వారి వేతనాలు, పని వేళలను అడిగి తెలుసుకున్నారు.