విజయ్ మాల్యా ఆస్తులపై సిబిఐ దాడులు

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన ముంబై, గోవా,బెంగుళూరు నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు జరిపింది. పలు చోట్ల ఈ దాడులు ఏకకాలంలో కొనసాగాయి, ఐడీబీఐ బ్యాంక్ నుంచి 950 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన కేసులో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్‌ షీట్‌ నష్టాలు చూపిస్తున్నప్పటికీ రుణాలు పొందడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలున్నాయి. త్వరలో విజయ్‌ మల్యాను ప్రశ్నించే అవకాశం ఉంది.