ఉద్రిక్తత మధ్య విశాఖలో అక్రమ కట్టడాల కూల్చివేత

విశాఖపట్నంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు భగత్‌సింగ్‌ నగర్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విశాఖ నగరంలోని భరత్‌సింగ్‌ నగర్‌ పరిధిలో ఉన్న మురికివాడలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. 14 అక్రమ కట్టడాలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సహాయంతో అధికారులు మాత్రం యధావిధిగా అక్రమ కట్టడాలను కూల్చి వేశారు.