రిజర్వేషన్లు తొలగిస్తే ఉరేసుకుంటా: లాలూ

రిజర్వేషన్లు తొలగిస్తే ఉరేసుకుంటానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హెచ్చరించారు. బీహార్‌‌లో బిజెపి, ఎన్‌డిఏ పక్షాలకు అంత సీన్ లేదు కాబట్టే ప్రధాని మోడీ స్వయంగా చిన్న చిన్న సభల్లో కూడా పాల్గొనాల్సి వస్తోందని అన్నారు. పలు ఎన్నికల సభల్లో పాల్గొన్న లాలూ తనను పిశాచి అనడం ద్వారా మోడీ మొత్తం యాదవ వంశాన్ని అవమానించారని ఆరోపించారు. ఈ నెల 12న బీహార్‌లో తొలివిడత ఎన్నికలు జరగనున్న సందర్భంలో రిజర్వేషన్ల విషయంపై ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.