బన్నీకి ఫిదా అయిపోయిన జక్కన్న

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తీరుకు డైరెక్టర్ రాజమౌళి ఫిదా అయిపోయారు. ట్విట్టర్‌లో తెగ పొగడేశారు. పనిలో పనిగా రుద్రమదేవి చిత్రం గురించి తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశారు. మూవీలో గోన గన్నారెడ్డి పాత్ర అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కథ కాస్త నెమ్మదిగా సాగుతున్న సమయంలో గోనగన్నారెడ్డి పాత్ర ఒక్కసారిగా వేగాన్నిపెంచిందన్నారు.

రానా,అనుష్కల మధ్య మరిన్ని సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉన్న నిడివిలో రానా తన పాత్రకు న్యాయంచేశారని కితాబిచ్చారు. ప్రకాశ్ రాజ్ శివదేవయ్య పాత్రలో ఒదిగిపోయాడని ట్వీట్ చేశారు. రుద్రమదేవి లాంటి మంచి సినిమా అందించిన గుణ టీంకు ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాకు వినోదపన్ను మినహాయింపు వెనుక బన్నీ కృషి ఉన్నట్టు తెలిసిందని… అలా చేయడం ద్వారా రీల్‌లోనే రియల్ లైఫ్‌లోనూ బన్నీ హీరో అయిపించుకున్నారని మౌళి తెగ పొగిడేశారు.