నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు జరిమానా

సమాచార హక్కు(స.హ) చట్టం కింద అడిగిన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా ఇవ్వని కారణంగా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలలకు స.హ రాష్ట్ర కమిషనర్ తాంతియా కుమారి జరిమానా విధించారు. ఈ కళాశాలల్లో జరుగుతున్న పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పించాల్సిందిగా ఒకరు కోరారు. నిర్దేశిత గడువులోగా ఈ సమాచారాన్ని అందజేయక పోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స.హ కమిషనర్ స్పందించి ఈ రెండు కళాశాలలకు జరిమానా విధించారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు రూ. 25 వేలు, నారాయణ కళాశాలకు రూ.10 వేల జరిమానాతోపాటు మరో రూ.2 వేల నష్ట పరిహారాన్ని కూడా అందజేయాలని ఆదేశించారు.