చైన్‌ స్నాచింగ్‌ దుండగులపై పోలీసుల కాల్పులు

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఇద్దరు వ్యక్తులు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ వెంటనే స్పందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే వెంటనే ఆ మహిళ ఎల్‌బి నగర్‌ పోలీసులకు సమాచారం అందించింది. చైన్‌స్నాచర్‌పై యాంటీ స్నాచింగ్‌ టీమ్‌కు సంబంధిత పోలీసులు సమాచారం అందించగా రెండు నిమషాల్లో వారు అక్కడికి చేరుకున్నారు. అయిన్నప్పటికీ దొరకలేదు. అయితే వెంటనే స్నాచర్లు వెళ్ళిన దిశగా గాలింపు చేపట్టినప్పుడు వారు తారసపడ్డారు. వారు తప్పించుకుని పోతుండడంతో వారిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులకు కూడా వారు చిక్కలేదు. తప్పించుకుని పారిపోయారు. దీంతో చైన్‌స్నాచర్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.