ఓ ఇంటికి అల్లుడు కాబోతున్న యువరాజ్‌

క్రికెటర్ యురాజ్‌సింగ్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది.  యూవీతో ఏడుఅడుగులు వేసి భాగ్యాన్ని బాలీవుడ్ నటి హజెల్‌ సొంతం చేసుకున్నారు. ఇండోనేషియాలోని బాలిలో యూవీ, హజెల్ ఉంగరాలు మార్చుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కలిసి చక్కర్లుకొడుతూ చాలాసార్లు మీడియా కంటపడ్డారు. చివరకు ఇద్దరి ప్రేమ పెళ్లిపీటలెక్కబోతోంది.  ఇటీవల దీపావళికి పెళ్లికబురు చెబుతానని ట్విట్లర్‌లో చెప్పిన యువరాజ్‌ అన్నట్టుగానే  చేశారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుంది.