తోటి ఎమ్మెల్యేకు బాలయ్య వార్నింగ్

హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. హిందూపురం నియోజకవర్గానికి వెళ్లే వాటర్ పైప్‌లైన్‌కు కొందరు చిల్లులు పెట్టడమే వివాదానికి కారణమైంది. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తన నియోజవకర్గంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్‌లైన్‌ ద్వారా తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవల పదేపదే పైప్‌లైన్‌కు కొందరు చిల్లులు పెడుతున్నారట. దీని వెనుక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి హస్తం ఉందంటూ కొందరు వ్యక్తులు బాలకృష్ణకు లేనిపోనివి నూరిపోసారని తెలుస్తోంది. 

Click to Read: చంద్రబాబు ఫోటోకు రంగు పూసింది ఎవరు..?

దీంతో … ఆగ్రహించిన బాలయ్య… హనుమంతరాయచౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. నీళ్లు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ రుసరుసలాడారట. బెదిరిపోయిన చౌదరి … బాలకృష్ణకు వివరణ ఇచ్చుకున్నారు. పైప్‌లైన్ లీకేజ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఇలా తనను నిందించవద్దని కోరారని చెబుతున్నారు. తనకు ఏ పాపం తెలియని విషయంలో బాలకృష్ణ నిందించడంతో హనుమంతరాయ చౌదరి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. 

Click to Read: నిర్ధారణ- ఓటుకు నోటు వాయిస్‌ ఆయనదే