సిగరెట్ తాగుతూ టీడీపీ క్రమశిక్షణపై మాట్లాడిన ఆనం

టీడీపీలో ఉన్నా కాంగ్రెస్‌లో ఉన్నా తన తీరు మారదని ఆనం వివేకానందరెడ్డి మరోసారి రుజువు చేసుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్న తర్వాత ఒక చానల్‌తో మాట్లాడిన ఆనం వివేకా తన పాత విధానాన్నే పాటించారు. వివేకాను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధి ”కాంగ్రెస్‌లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ టీడీపీలో అలా ఉండదని చెబుతారు. క్రమశిక్షణతో ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీ తీరు ఎలా ఉంటుంది” అని మీడియా ప్రతినిధి ప్రశ్నించిన సమయంలో ఆనం వివేకా సిగరేట్‌ చేతిలోకి తీసుకున్నారు.

anam2సిగరేట్ తాగుతూనే సమాధానం చెప్పారు. తాము మర్రిచెట్టు కాదని … తుంగ గడ్డిలాంటి వారిమన్నారు. ఏరు వస్తే వంగిపోతాం ప్రవాహం ఆగిపోగానే మళ్లీ పైకి లేస్తామని చెప్పారు. ఏదైనా పార్టీ లైన్ బట్టే తమ విధానం ఉంటుందన్నారు. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని వివేకా చెప్పారు.

Click to Read: Bala Krishna gives warning to his colleague?