వైఎస్‌ను పొగిడి చిక్కుల్లో పడ్డ ఆనం

ఎంట్రిపాస్ దొరికినంత ఈజీగా నెల్లూరు టీడీపీ నేతలతో కలిసిపోవడం ఆనం బ్రదర్స్‌కు కుదిరేలా కనిపించడం లేదు. ఆనం సోదరులు పార్టీలో చేరి రెండు రోజులు కూడా గడవకముందే నెల్లూరు తెలుగు తమ్ముల్లు పంచాయతీ పెట్టారు. టీడీపీలో చేరిన రోజు ఆనం వివేకానందరెడ్డి అన్న ఒక్క మాటను పట్టుకుని లోకల్‌లో తెలుగుతమ్ముళ్లు పార్టీ నేతల వద్ద రచ్చమొదలెట్టారు.

పార్టీలో చేరిన రోజు ఆనం వివేకా.. జగన్‌ను తిట్టేక్రమంలో వైఎస్‌ను పొడిగారు. వైఎస్‌ దేవుడండి.. బంగారం. కానీ జగన్‌ అలా కాదు. వైఎస్‌ వారసుడిని అని చెప్పుకునే హక్కు కూడా జగన్‌కు లేదని విమర్శించారు. గురువారం సీనియర్ నేత సోమిరెడ్డి, నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర వద్దకు వచ్చిన నెల్లూరు, ఆత్మకూరు నియోజవర్గ నేతలు … ఆనం బ్రదర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా తమపై కేసులుపెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఆనం సోదరులకు సహకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తామంతా ఇంతకాలం వైఎస్‌ రాక్షసుడు అని తిడుతుంటే పార్టీలో చేరిన తొలిరోజే వైఎస్ దేవుడని వివేకా ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ అవినీతిపరుడంటూ ఢిల్లీ వరకు వెళ్లి పుస్తకాలు పంచాం కదా ఇప్పుడు ఆనం మాటలను ఎందుకు ఖండించడం లేదంటూ సోమిరెడ్డి, బీద రవిచంద్రను నిలదీసినంత పనిచేశారు. అసలు ఆనం బ్రదర్స్‌ను తెచ్చారు సరే ఆత్మకూరు, నెల్లూరు నియోజకవర్గాలకు ఇంతకాలం పనిచేసిన టీడీపీ నేతల సంగంతేంటో ముందు తేల్చండని డిమాండ్ చేశారు. వారిని సముదాయించడం సోమిరెడ్డికి చాలా కష్టమైపోయింది. చివరకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆనం బ్రదర్స్‌కు సహకరించబోమని తేల్చేసి వెళ్లారు లోకల్ నేతలు. ఈ పరిణామంపై ఆనం వివేకా బ్యాచ్‌ మాత్రం ఇలాంటి రాజకీయాలు చాలా చూశాంలే అంటూ లైట్ తీసుకుంటోంది. 

Click to Read: Govt agency lands Modi in trouble