మళ్లీ తెరపైకి తారా చౌదరి, కేసు నమోదు

తారా చౌదరి మరోసారి తెరపైకి వచ్చారు. రాష్ట్రంలోని పలువురు బడాబాబులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా గతంలో వార్తల్లోకి ఎక్కిన తారా చౌదరిపై తాజాగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఆడపడుచుపై తారా చౌదరి దాడి చేసిన ఘటనలో కేసు నమోదైంది. శుక్రవారం సోదరుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన తారా చౌదరి అక్కడ తన వదినపై దాడి చేశారు. తన ఇంటికి వచ్చి పనిచేయాల్సిందిగా ఘర్షణపడ్డారు.  దీంతో కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అక్కడికి చేరుకున్న పోలీసులు తారా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసుల పట్ల కూడా తారా చౌదరి దురుసుగా ప్రవర్తించారు. వారిని బూతులు తిట్టారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తారా చౌదరిపై కేసులు నమోదు చేశారు.